యూనిట్

రక్తదాన శిబిరం

  అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ పటాలములో రక్తదాన శిబిరాన్ని కడప జిల్లా ఎస్‌.పి. అన్బురాజన్‌, కమాండెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఎస్‌.పి, కమాండెంట్‌లు రక్తదానం చేశారు.కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీ, రిమ్స్‌ హాస్పిటల్‌ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో జరిగింది. పటాలములోని సిబ్బంది 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ కె.ప్రభాకర్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు వి.కేశవరెడ్డి, పి.శౌకత్‌అలీ, ఆర్‌.ఐ.లు డి.వి.రమణ, ఎం.గురునాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని