యూనిట్
Flash News
రక్తదాన శిబిరము

పోలీసు
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 3వ పటాలము యూనిట్ హాస్పిటల్ నందు కమాండెంట్ బి.శ్రీరామమూర్తి ఆదేశాల
మేరకు అడిషనల్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు అధ్యక్షతన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో
రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు
మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా రక్తదానం చాలా ఉన్నతమైనదని రక్తదానం చేస్తే
ప్రాణదానం చేసినట్లేనని అన్నారు. శిబిరంలో 61 మంది
సిబ్బంది రక్తదానం చేశారు. పోలీసు సిబ్బంది యొక్క పిల్లలకు వ్యాసరచన పోటీలు,
వకృత్వ పోటీలు నిర్వహించారు. 67 మంది
విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెట్స్ ఎస్.దేవానందరావు, జి.లక్ష్మినారాయణ,
డాక్టర్లు కే.కామరాజు, యూనిట్ డాక్టర్
ఎం.రాఘవేంద్రరావు, ఆర్.ఐ.లు బిఎస్‌సి శేఖర్‌రావు,
సత్యనారాయణ, ఎం.విల్సన్‌బాబు, ఆర్.ఎస్.ఐ. రవితేజ, మురళీకృష్ణ, ప్రిన్సిపల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.