యూనిట్
Flash News
ఎర్రచందనం స్మగ్లర్లపై మెరుపుదాడి

తిరుపతి అటవీ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికి వేసి, వాటిని రవాణా చేయడానికి ఓ స్మగ్లర్ల ముఠా అడవిలోకి ప్రవేశిస్తుందని ముందస్తు సమాచారం అందింది. వెంటనే స్పందించిన రెడ్‌శాండర్స్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించారు. పోలీసులు వస్తున్నారని గమనించిన స్మగ్లర్లు వారు ప్రయాణిస్తున్న కారుతోపాటు, భోజనాలు, ఇతర సామాగ్రిని అక్కడే వదిలి పోలీసులకు పట్టుబడకుండా ఉడాయించారు. దీంతో సమాచారం అందుకున్న ఐజిపి డా||ఎం.కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వారిని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశించారు. ఎర్రచందనం సంపద మనరాష్ట్రానికి ఓ బంగారు వరంలాంటిదన్నారు. ఆ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిబ్బందికి సూచించారు. స్మగ్లర్లు చెట్లను నరికివేయకుండా అడ్డుకున్నందుకు సిబ్బందిని అభినందించారు. కారును, వారు ఉపయోగించిన ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.