యూనిట్
Flash News
భవానీ సేవాదళ్ సేవలు భేష్

విజయవాడ
నగరంలోని ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవ వేడుకల్లో భవానీ సేవాదళ్ సభ్యులు
చేసిన సేవలు ప్రజల మన్ననలు అందుకున్నాయి. 120 మంది పోలీస్ సిబ్బంది సేవాదళ్‌గా ఏర్పడి రోజుకు మూడు షిప్టులలో
విధులు నిర్వర్తించారు. అంతరాలయం, ఓం టర్నింగ్, ప్రసాదం కౌంటర్లు మరియు ఇతర ప్రదేశాల్లో వృద్ధులు, దివ్యాంగులు మరియు నడువలేని స్థితిలో వున్న వారిని గుర్తించి వీల్
ఛైర్లపై మరియు చేతపట్టుకుని అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనాల అనంతరం వారి గమ్య
స్థానాలకు పంపించే వరకు సహాయ సహకారాలను అందించి శభాష్ అనిపించుకున్నారు. భవానీ
సేవాదళ్ సభ్యులు చేసిన సేవలకు నగర పోలీస్ కమీషనర్ అభినందనలు తెలియజేసారు.