యూనిట్

సువిధ డార్మెటరీ ప్రారంభం

నెల్లూరు జిల్లా పోలీసు సిబ్బంది యొక్క సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్‌.పి. ఐశ్వర్య రస్తోగి కషితో ఆర్‌ఐ వెల్ఫేర్‌, ఆర్‌ఐ అడ్మిన్‌, జిల్లా పోలీసు అసోసియేషన్‌ సంఘం అధ్యక్షుల కోఆర్డినేషన్‌లో సిబ్బంది కొరకు తొలిసారిగా ఏసీ డార్మెటరీలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా ఎస్‌.పి. చేతులమీదుగా ప్రారంభించారు. వీటిలో స్పెషల్‌ పార్టీలకు, మహిళా సిబ్బందికి మొత్తం 50 పడకలతో కూడిన 3 సువిధ ఏసీ డార్మెటరీలు ఉన్నాయి. అనంతరం ఎస్‌.పి. మాట్లాడుతూ నెల్లూరు జిల్లాతో పాటు ఇతర దూర ప్రాంతాలనుండి బందోబస్తులు, స్పోర్ట్స్‌ మీట్‌లు, ఇతర ప్రత్యేక విధులు నిర్వహించడానికి వచ్చే పోలీస్‌ సిబ్బంది వసతి, విశ్రాంతి కలిగించేందుకు, సంక్షేమంలో భాగంగా ఏసీ డార్మెటరీలు వేరు వేరుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వసతిని హోంగార్డులతో సహా పీసీలు, మహిళా పీసీలు మరియు స్పెషల్‌ పార్టీలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌్‌.పి.లు పి.పరమేశ్వర రెడ్డి, ఎస్‌.వీర భద్రుడు, ఇతర అధికారులు, పోలీసు అసోసియేషన్‌ సంఘం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని