యూనిట్

గిరిజన అభివృద్ధిని ఆటంకించే శక్తులతో అప్రమత్తంగా ఉండాలి: చింతపల్లి ఏ ఎస్పీ

గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకపరిచే అసాంఘిక  శక్తులతో అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి అదనపు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం విశాఖపట్నం జిల్లా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొయ్యురు మండలం బూదరాళ్ల పంచాయతీ గరిమండ గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరంలో పాల్గొని మాట్లాడారు. శంకర ఫౌండేషన్, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి, కొయ్యురు, పేదవలస, కె డి పేట, పి హెచ్ సి, చింతపల్లి సి హెచ్ సి వైద్యుల ఆధ్వర్యంలో 367  మంది గిరిజనులకు వైద్య పరీక్షలు జరిపి ఉచిత మందులు పంపిణీ చేసారు. 52 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా 60 బృందాలు పాల్గొన్నాయి. విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిని  నల్లబల్లి గ్రామం, రెండో బహుమతిని ఎర్రగొండ గ్రామం, మూడవ బహుమతిని కొయ్యురు గ్రామాలూ గెలుచుకున్నాయి. కార్యక్రమంలో కొయ్యురు సి ఐ రమణ, ఇతర ఎస్సైలు పాల్గొన్నారు.  

వార్తావాహిని