యూనిట్
Flash News
మహిళలు, యువతుల రక్షణకు 'బీ సేఫ్' యాప్ ఆవిష్కరణ
రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్
అన్న అంశంపై అవగాహనా సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం
మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారు మాట్లాడుతూ సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి
సాధిస్తుండగా, అదే రీతిలో సైబర్ నేరాలు
కూడా విజృంభిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు,
యువతులు సైబర్ వేధింపులబారిన పడి వేదనకు గురవుతున్నారని చెప్పారు.
అవసరం ఉన్నంత వరకే సాంకేతికను వినియోగించుకోవాలని, శృతి మించిన యెడల ఎన్నో అనార్థలకు ఇది హేతువ అవుతుందని తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువత రక్షణ కోసం రూపొందించడిన 'బీ సేఫ్' యాప్‌ను ఆవిష్కరించారు. ఏదైనా ఆపదలోను, సమస్యల్లోను వున్న వారు ఈ సాంకేతికత సహాయంతో పోలీస్ వారి సహాయం తక్షణమే పొందగలరని తెలిపారు. అదే విధంగా అత్యవసర ఫోన్ నెంబర్లు 100, 181, 112 మరియు వాట్సాప్ నెంబర్ 9121211100 లపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి వుండడమే కాకుండా ఇతరులకు కూడా వీటి గురించి వివరించాలని సూచించారు. మహిళా మిత్ర, సైబర్ మిత్రలతో మహిళలకు నిరంతరం అండగా వుంటున్నామని తెలిపారు.
సైబర్ నేరాలు అధికంగా బాలికలు, యువతులు, మహిళలపైనే జరుగుతున్నాయని, రాష్ట్ర పోలీస్ శాఖ
వినూత్న సాంకేతిక విధానాలతో వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తుందని రాష్ట్ర స్త్రీ
శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారు అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్
ఛైర్‌పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతూ సైబర్ నేరాల
బారినపడకుండా ఏవిధమయిన జాగ్రత్తలు పాటించాలి, ఒక వేళ నేరాలు
జరిగితే ఏ విధంగా స్పందించాలి అన్న విషయాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని విజ్ఞప్తి
చేశారు.
రాష్ట్ర డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్
గారు మాట్లాడుతూ ఎవరైనా ఆపదలో వున్న సమయంలో అత్యవసర ఫోన్‌ల ద్వారా తెలియజేసిన
పక్షంలో పోలీస్ తక్షణమే స్పందించి సహాయాన్ని అందజేస్తుందన్నారు. మహిళలు, విద్యార్థినులు సైబర్
యోధులుగా సుశిక్షితులై, సైబర్ నేరాల కట్టడికి
తోడ్పడాలన్నారు. ప్రజారక్షణలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పడానికి
ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, అప్పా డైరెక్టర్ ఎన్. సంజయ్, విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. నాగేంద్రకుమార్, టెక్నికల్ డిఐజి పాలరాజు, పాల్గొన్నారు.