యూనిట్

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

సమస్యలు విన్నవించుకోవడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో నవ్వుతూ మర్యాదగా వ్యవహరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌ చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో రిసప్షనిస్ట్‌లకు ఏర్పాటు చేసిన 'స్పందన సాప్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ ఫర్‌ రిసప్షనిస్ట్స్‌' అనే ఒక్కరోజు శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల రిషెప్సన్‌ పాయింట్‌ల వద్ద ఫిర్యాదుదారుడు కూర్చోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మంచి నీటిని అందుబాటులో వుంచాలని ఆదేశించారు. ఫిర్యాదు దారునితో పాజిటివ్‌ ధృక్పధంతో మాట్లాడి ఫిర్యాదును వెంటనే పై అధికారికి అందించాలని తెలిపారు. క్వాలిటీ ఆఫ్‌ డిస్పోజల్‌ సంతృప్తి కరంగా వుండాలని, వారిని సంతృప్తి పర్చలేకపోతే అందుకు తగిన కారణాలు వివరించాలి అని పేర్కొన్నారు. రిసెప్షనిస్ట్‌ విధులను పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని సూచించారు. రిసెప్షనిస్ట్‌లకు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.పరమేశ్వర్‌ రెడ్డి, డిఎస్పీ కోటరెడ్డి శ్రీధర్‌, వెల్ఫేర్‌ ఆర్‌.ఐ చంద్రమోహన్‌, సి.ఐ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని