యూనిట్

అనారోగ్యంతో మృతి చెందిన సి ఐ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బ్యాచ్ మేట్స్

బాపట్ల జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్  ఇటీవల గుండె నొప్పితో మరణించిన సి ఐ మల్లి నాగేశ్వరరావు  కుటుంబసభ్యులకు 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసినారు.  1996 పోలీస్ ఎస్.ఐ బ్యాచ్ కి చెందిన తోటి మిత్రుడు మల్లి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సీఐ గా విధులు నిర్వహిస్తు  హఠాత్ గా గుండెపోటుతో మరణించారు. అతడి కుటుంబాన్ని ఆదుకోవడం కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్న 1996 పోలీస్ ఎస్.ఐ బ్యాచ్  మేట్స్ అందరు కలిసి అక్షరాల 10 లక్షల రూపాయలు సమకూర్చినారు. వాటిని గురువారం బాపట్ల  జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ  చేతుల మీదుగా నాగేశ్వరరావు   సతీమణి వెంకటలక్ష్మి, కుమారుడు అంజనీకుమార్ లకు 7 లక్షల నగదు, భర్త మరణించడంతో నాగేశ్వరరావు సంరక్షణలో జీవనం సాగిస్తున్న అతడి సోదరి వై.రాధకు 3 లక్షల రూపాయలు అందజేసారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నాగేశ్వరరావు అకాల మరణం చెందడంతో 1996 పోలీస్ బ్యాచ్ కి చెందిన తోటి బ్యాచ్ మేట్స్ మేము అండగా ఉన్నాము అని ముందుకు వచ్చి నాగేశ్వరరావు   కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందించడం హర్షించ దగ్గ విషయమన్నారు. నాగేశ్వరరావు  కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల పరిహారాలు మరియు రాయితీలు సకాలంలో అందించడానికి కృషి చేస్తామన్నారు. వారికి ఏదైనా సమస్య వస్తే నేరుగా సంప్రదించవచ్చునన్నారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  తో పాటు చీరాల రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్  ఏ.మల్లికార్జున రావు  , ఎస్.బి ఇన్ స్పెక్టర్ ఏ.శ్రీనివాస్  ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని