యూనిట్

బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధం- కర్నూలు ఎస్పీ

జిల్లాలో ఎక్కడపడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా  బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, ఫ్లెక్సీలు అనధికారికంగా ఎవరు కట్టకూడదని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి   ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా సంబంధిత పరిధులలోని పోలీసుశాఖ, మునిసిపల్ కార్పోరేషన్,  పంచాయితీ అధికారుల అనుమతులను పొంది ఖచ్చితంగా రశీదు తీసుకోవాలన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకోని  వారిపై చర్యలుంటాయన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా, ఇబ్బందికరంగా, అసౌకర్యంగా, మతాలను ప్రలోభ పెట్టె విధంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

వార్తావాహిని