యూనిట్
Flash News
శిక్షణలో వున్న మహిళా పోలీసులకు మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

అనంతపురం
డి.టి.సి లో శిక్షణ పొందుతున్న మహిళా పోలీసులకు ... మహిళలు, బాలికలపై జరిగే నేరాలు మరియు మహిళా చట్టాలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా
ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్రం
బళ్లారి జిల్లా హొస్పేట్ కు చెందిన ఎం ఎస్ పి ఎల్ సంస్థ కార్పోరేట్ సోషల్
రెస్పాన్సిబిలిటీ విభాగం నుండీ
వచ్చిన ప్రతినిధులు క్షుణ్ణంగా అవగాహన చేశారు. ఈ విభాగానికి చెందిన రంజిత, విరోనిక, రేవతి, సంధ్య
ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి " డేర్ వర్క్ షాపు" పేరున
విద్యాసంస్థలలోని అమ్మాయిలను చైతన్యం చేస్తున్నారు. ఇక్కడి డి.టి.సి లో చేపట్టిన
కార్యక్రమంలో భాగంగా మహిళలుపై జరిగే అత్యాచారాలు, ఈవ్
టీజింగ్ , స్వీయరక్షణ, బేసిక్ మార్షల్
ఆర్ట్స్ టెక్నిక్, లీగల్ అవేర్నెస్, ఛైల్డ్
హెల్ప్ లైన్ 1098 యొక్క ప్రాముఖ్యతలు గురించి వివరించారు.
ఈకార్యక్రమంలో డి.టి.సి సి.ఐ పవన్ కుమార్, ఎస్ ఐ చలపతి,
సిబ్బంది మరియు శిక్షణ పోందుతున్న 95 మంది
మహిళా పోలీసులు పాల్గొన్నారు.