యూనిట్
Flash News
ఆరోగ్యంపై అవగాహన
ఆరోగ్యంపై అవగాహన మంగళగిరిలోని 6వ పటాలంలో ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకష్ణతో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కమాండెంట్ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితోపాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరమాచినేని మాట్లాడుతూ మన రోజువారి ఆహారం ఏవిధంగా ఉండాలి, ఏ సమయానికి ఆహారం తీసుకోవాలి, షుగరు బీపీ లాంటి రోగాలు రాకుండా ఏ విధంగా ఉండాలో పలు సూచనలు ఇచ్చారు. అలాగే షుగరు బీపీ ఉన్నవాళ్లు ఎటువంటి వ్యాయామాలు చేయాలి ఏ విధంగా జీవించాలి అని మన పోలీస్ సిబ్బందికి చెప్పారు.విలువైన సమాచారాన్ని ఇచ్చిన డైటీషియన్‌ను కమాండెంట్ సత్కరించారు.