యూనిట్
Flash News
ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజలకు అవగాహన సదస్సు
గుంటూరు
అర్బన్ పరిధిలో పోలీసు ప్రచార రథం ద్వారా లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం
గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు గుంటూరు అర్బన్ ఎస్.పి. పి.హెచ్.డి రామకృష్ణ
నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఆర్బన్ కంట్రోలు రూమ్ నందు 24 గంటలు సిబ్బంది అందుబాటులో అప్రమత్తంగా
ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సమాచారం రాగానే సంబంధిత పోలీస్ సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్.హెచ్.ఎం.ఎస్
సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈయాప్‌పై ప్రజల్లో అవగాహన
కల్పిస్తున్నారు. సిస్టమ్‌పై షిఫ్ట్ సిస్టమ్‌లో పనిచేస్తున్న సిబ్బంది హెచ్‌సి
విద్యాసాగర్, పీసీలు గోపికృష్ణ, వీర్రాజులు సంబంధిత ఏరియాలో ఉన్న సిబ్బందిని, సంబంధిత
అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతోంది. తక్షణమే అక్కడకు చేరుకొని సదరు ఇంటిని
చుట్టుముట్టి అందులోకి వచ్చిన దొంగలను పట్టుకోవడం జరుగుతోందని ఎస్.పి. పిహెచ్‌డి
రామకృష్ణ తెలిపారు. నవంబర్ 16,2018న పాత గుంటూరు పరిధిలో
ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏర్పాటు చేసిన ఒక ఇంటిలో చోరీ చేయుటకు ప్రవేశించిన తాళ్లూరి
దేశాయ్‌ను దొంగతనానికి పాల్పడుతుండగా చాకచక్యంగా ముద్దాయిని కటకటాల వెనక్కి
పంపారు. ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ వీరానాయక్ ఆధ్వర్యంలో మహిళా ఎస్.ఐ.
భాగ్యలక్ష్మి, పిసిలు శ్రీనివాసరావు, హెచ్‌జిలు రాజా, డ్రైవర్ నాగరాజులువారి వారి
విధులతో పాటు సమాజములో జరుగుచున్న వివిధ రకాలైన మోసాలకు, నేరాలకు
సంబంధించిన, మత్తు పదార్ధాల వల్ల అనర్ధాలు, అత్యాచారాల నిరోధానికి మొదలైన విషయాలలో ఫీల్డ్ లెవెల్ లో అవగాహన
కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై 2వేల వరకు కొత్తగా సభ్యులను చేర్చారు.