యూనిట్

ఓపెన్‌హౌస్‌తో విద్యార్థులకు అవగాహన

గుంటూరు  జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మరియు హెడ్‌ క్వార్టర్స్‌ నందు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్‌.పి. సి.హెచ్‌.విజయరావు పోలీసు కవాతు మైదానము నందు ఓపెన్‌ హౌస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు ఎస్‌.పి. అవగాహన కల్పించారు. ఈ సందర్భముగా ఎస్‌.పి. మాట్లాడుతూ ఓపెన్‌ హౌస్‌ నందు వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారు, ఏదైనా గొడవలు జరిగినపుడు మాబ్‌ని కంట్రోల్‌ చెయ్యడానికి ఉపయోగించే రైట్‌ గేర్‌ ఎక్విప్మెంట్‌, సాంకేతికతలో భాగంగా ఉపయోగించే బాడీ వోర్న్‌ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు. పోలీసులకు సంబంధించిన అన్ని విషయాలపై డెమో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమానికి గుంటూరు దగ్గరలో అందుబాటులో ఉన్న విద్యార్ధిని విద్యార్ధులు హాజరైనారు.

వార్తావాహిని