యూనిట్

సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు తిరుపతి యస్‌.వి యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌లో తిరుపతి అర్బన్‌ పరిది˜లో అన్ని కాలేజీల విద్యార్ధినీలకు సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సును అర్బన్‌ యస్‌.పి కె.కె.యన్‌.అన్బురాజన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయాన మాట్లాడుతూ ఇటీవల రోజు రోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని ఇందులో ముఖ్యంగా చాలావరకు యువత మోసపోతున్నారన్నారు. మీరు ఉపయోగించే ఆండ్రాయిడ్‌ ఫోన్లో మనకు తెలియకుండానే ఎన్నో సున్నితమైన ఆప్స్‌ ఉన్నాయని, పొరపాటున మనం వాటిని ఓపెన్‌ చేసినా మన యొక్క డేటా మొత్తం అందులో వెళ్ళిపోతుందన్నారు. తిరుపతిలో సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌, టెలిగ్రాం గ్రూప్‌ లను ఏర్పాటు చేసామని టెలిగ్రాం నందు ఒకేసారి లక్ష మందిని గ్రూప్‌ నందు యాడ్‌ కావొచ్చని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈ సందర్బంగా అడిషనల్‌ యస్‌.పి అనిల్‌ బాబు, యస్‌.వి.యు. ప్రొఫెసర్‌ మధుమూర్తి , కంప్యూటర్స్‌ అండ్‌ సైన్సు, రాంమోహన్‌ రావు , ఫోరెంసిక్‌ సైన్సు మరియు స్పెషల్‌ బ్రాంచ్‌ డి.యస్‌.పి సి.యం.గంగయ్య, వెస్ట్‌ డి.యస్‌.పి నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని