యూనిట్
Flash News
మహిళా భద్రతపై విజయవాడలో మహిళా మిత్ర సభ్యులకు అవగాహనా సదస్సు
మహిళా సమస్యల పరిష్కారం, మహిళా హక్కుల రక్షణే ధ్యేయగా 2016 లో నాటి పోలీస్ కమిషనర్ శ్రీ డి. గౌతమ్ సవాంగ్
గారు రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ
కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధిస్తూ విజయవంతంగా కొనసాగుతుండడంతో డిజిపి శ్రీ
గౌతమ్ సవాంగ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప జేశారు. ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్
జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు మరింత భరోసా కల్పించాలన్న ఆశయంతో దిశా చట్టం 2019, రూపొందించడంతో
పాటు, గ్రామా/వార్డ్
మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవస్థను ప్రారంభించారు.
వీటిపై మహిళా మిత్ర
సభ్యులకు అవగాహన కల్పించేందుకుగాను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ''ఉమెన్ సేఫ్టీ రోల్ ఆఫ్ మహిళా మిత్ర'' సదస్సు
నిర్వహించారు. దీనికి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ గారు, దిశా చట్టం స్పెషల్ ఆఫీసర్స్ శ్రీమతి కృతి శుక్ల, ఐపీఎస్ , శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరై
దిశా నిర్ధేశం చేసారు. కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ విజయవాడలో
ప్రథమంగా అమలు చేసిన మహిళా మిత్ర విజయవంతం కావడంతో నేడు రాష్ట్రమంతా
విస్తరించారన్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామా/వార్డ్ మహిళా సంరక్షణ
కార్యదర్శులతో సమన్వయము కలిగి మహిళా సమస్యల పరిష్కారానికి
దోహదపడాలన్నారు. సైబర్ వేధింపులు ,ఆన్ లైన్ మోసాలు, సురక్షిత
ప్రయాణం,ఉద్యోగ
మోసాలు, ఎల్ హెచ్ ఎం ఎస్ , దొంగలబారిన పడకుండా జాగ్రత్తలు, డయల్ 100 , 112 ,181 ,1098 , పోలీస్ వాట్సాప్ నెం 7328909090 , సైబర్ మిత్ర ఫోన్ నెం 9121211100, బ్లుకోల్ట్స్, రక్షక్, ఇంటర్ సేఫ్టీ మొబైల్, శక్తి టీమ్, 4
వ సింహం తదితర విషయాలపై మహిళల్లో చైతన్యం కలిగించాలన్నారు.
దిశా చట్టం స్పెషల్
ఆఫీసర్స్ శ్రీమతి కృత్తిక శుక్ల , శ్రీమతి దీపికా పాటిల్ లు దిశా చట్టం ఆవశ్యకత , గ్రామా/
వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులతో పాటు కలిసి నిర్వర్తించాల్సిన విధి విధానాలను
తెలియజేయసారు. జాయింట్ పోలీస్ కమీషనర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళా
సంబంధిత నేరాలలో 20 శాతం మాత్రమే శిక్షలు పడుతుండగా మిగిలిన 80 శాతం
నిందితులు శిక్ష నుండి తప్పించుకుంటున్నారని, అన్యానికి గురైన ప్రతి మహిళా వీరనారీమణుల సుఫుర్తితో ధైర్యంగా నిలిచి
నిందితులకు శిక్షలు పడేలా పోలీస్ కు సహకరించాలన్నారు. సైబర్ పోలీస్ స్టేషన్
ఇన్స్పెక్టర్ కె.శివాజీ , 2 వ ఏ సి ఎం ఏ పిపి శ్రీమతి గీత , ఉమెన్
అండ్ వెల్ ఫెర్ డిపార్టుమెంట్ శ్రీమతి సుధా, వాసవ్య మహిళా మండలి డాక్టర్ కీర్తి, సెక్సాలజిస్ట్ డాక్టర్ రాధికా తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో స్టెల్లా కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి వి. ఎన్. మంగాదేవి, సిద్దార్థ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డి. పద్మ, మహిళా కళాశాల ఎసిపి వి వి నాయుడు, ఏలూరు డిటిసి జి వి ఎస్ పైడేశ్వర రావు, ఎపిపి శశికళ మరియు మరియు మహిళా మిత్ర సభ్యులు శ్రీమతి లక్ష్మి,శ్రీమతి సలోమి, శ్రీమతి దుర్గాదేవి, శ్రీమతి ఎన్ మాలతి ఇతర మహిళా మిత్ర సభ్యులు పాల్గొన్నారు.