యూనిట్
Flash News
ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు
సిఐడి పోలీస్ విభాగంలో ఎపిలోని ఏడు రీజినల్ కార్యాలయాల్లో పనిచేసిన సిబ్బందికి గత ఏడాదికి సంబంధించి గౌరవ ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పథకాలను గౌరవ అడిషనల్ డిజి సిఐడి శ్రీ పివి.సునీల్ కుమార్ గారు అందజేశారు. సోమవారం సిఐడి ప్రదాన కార్యాలయం సమావేశ మందిరంలో ఈ పథకాలను అందజేశారు. గత ఏడాది సిఐడి విభాగంలో విశేష ప్రతిభ కనబర్చిన డిఎస్పీ ఎన్.విజయప్రసాద్, ఇన్ స్పెక్టర్ ఆర్.శివ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ టి.వెంకటేశ్వరరావు, ఎంఆర్ సి రెడ్డి, ఎన్ వసంతనాయుడులకు అతి ఉత్కృష్ట సేవా పథకాలను, ఇన్ స్పెక్టర్ జి.మనోహర్ బాబు, ఎస్ ఐ బి.రామకోటేశ్వరావు, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్.రాజబాబు, జి.అక్కిరాజు, సిహెచ్ మల్లికార్జునరావు, సిహెచ్.రవీంద్రబాబు, ఎం.హరిప్రసాద్, ఎస్ డి షమీమ్, లోకేష్ బాబు, కానిస్టేబుల్స్ ఎస్.గిరిబాబు, ఆర్ శివకుమార్, టి.శ్రీనివాసరావులకు ఉత్కృష్ట సేవా పథకము లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఐజిలు సిఎమ్ త్రివిక్తమవర్మ, జె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు....