యూనిట్
Flash News
ఉద్యోగ విధుల్లో ప్రతిభకు పురస్కారం
చిత్తూరు జిల్లా ఎస్పీ సి.హెచ్. అప్పలనాయుడు నెలవారి నేర సమీక్షా సమావేశంను జిల్లా పోలీస్ అతిధి గృహం నందు నిర్వ హించారు. ఈ సందర్భ ముగా మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు దారునికి రశీదులు అందించి, సంబంధిత ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో విధి నిర్వహణలో ఉత్తమ విధులు నిర్వర్తించిన వారికి ప్రోత్సహాకాలను ప్రకటించారు. అవార్డులు శోధన అవార్డు గ్రహీతలు: బంగారు పాలెం ఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ దేవరాజుల రెడ్డి, కానిస్టేబుళ్ళు సురేష్, వినయ్, సీపీవో గోపి ప్రసాద్ రెడ్డి, గుర్రం కొండ ఎస్సై చిన్న రెడ్డప్ప, కానిస్టేబుల్ శ్రీనాధ్, ఎర్రచందనం విభాగం కానిస్టేబుళ్లు హరీష్, సుధాకర్. శోభిత అవార్డు గ్రహీతలు: మదనపల్లె తాలుకా సి.ఐ వెంకటేశులు, రెండో పట్టణ ఎస్సై సోమశేఖర్, పంజాని ఎస్సై లోకేష్ రెడ్డి, పలమనేరు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, చిత్తూరు తాలూకా హెడ్ కానిస్టేబుల్ శివకుమార్, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ కోలా బాపూజీ, కమాండ్ కంట్రోల్ కానిస్టేబుల్ గణేష్. స్పందన అవార్డు గ్రహీతలు: చిత్తూరు రెండో పట్టణ కానిస్టేబుల్ రామచంద, ఎస్.టి.ఎఫ్ కానిస్టేబుల్ కుమార్ అందుకున్నారు.