యూనిట్

సౌత్‌ కోస్టల్‌ ఐజిపికి అసోసియేషన్‌ సభ్యుల కృతజ్ఞతలు

ఇటీవల పదవీ విరమణ చేయబోతున్న ఏఎస్‌ఐలకు ఎస్‌.ఐ.లుగా పదోన్నతులు కల్పించి, వారి కుటుంబాల్లో పండుగ వాతావరణాన్ని నింపిన సౌత్‌కోస్టల్‌ ఐజిపి వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు సౌత్‌కోస్టల్‌ జిల్లాల పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. వారి పదోన్నతులకు సహకరించిన గుంటూరు ఎస్‌.పి.లు పిహెచ్‌డి రామకృష్ణ, శ్రీమతి ఆర్‌.జయలక్ష్మి, ప్రకాశం జిల్లా ఎస్‌.పి. సిద్దార్థ కౌశల్‌, నెల్లూరు జిల్లా ఎస్‌.పి. ఐశ్వర్య రస్తోగిలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పిసి నుంచి హెచ్‌సి పదోన్నతి పొందిన బి లిస్టు రావడం జరుగుతుందని, తదుపరి పదోన్నతులలో ఎస్‌.ఐ.ల పదోన్నతి లభిస్తుందని, ఈ విషయంపై రేంజ్‌ ఐజిపిగారు చొరవ తీసుకోవాలని ఐజిపిగారికి విన్నవించారు. దీనిపై ఐజిపి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల అధ్యక్షులు మద్దిపాటి ప్రసాద్‌, మాణిక్యరావు, మైలా సాంబశివరావు, జె.వెంకటేశ్వరరావు, బాలు, హుస్సేన్‌, లక్ష్మయ్య, మాజీ ఏపీ గౌరవాధ్యక్షుడు ఎం.గంగాధర్‌, మాజీ కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని