యూనిట్

కరుడుగట్టిన దారిదోపిడీ ముఠా అరెస్టు

మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన దొంగల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మధ్యప్రదేశ్‌కు చెందిన జాంజా సురేష్‌ కుమార్‌ (అలియాజ్‌ చప్పా), అంతిమ్‌ సిసోడియా, బుందేలా సునీల్‌గా గుర్తించారు. పోలీసుకు వచ్చిన సమాచారం మేరకు కర్నూలు, నంద్యాల జాతీయ రహదారిపై కంజారా గ్యాంగ్‌ ముఠాను నంద్యాల సబ్‌ డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్‌ 4,5,6న కర్నూలు-నంద్యాల-ఆళ్ళగడ్డ  రహదారిపై వెళుతున్న  కోరియర్‌ కార్గో కంటైనర్‌ వాహనాన్ని రన్నింగ్‌లోనే చాకచక్యంగా కట్టర్‌ల ద్వారా లాక్‌ను కట్‌ చేసి కంటైనర్‌లోకి ప్రవేశించి విలువైన సామాగ్రిని దొంగలించారు. 85 సెల్‌ ఫోన్లు, ఒక బాక్స్‌ మెడిసిన్‌, 16 చీరలు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి మరో రెండు లారీలు, పిడి బాకులు, ఒక ఐరన్‌ కట్టర్‌ స్వాధీనం  చేసుకున్నట్లు ఎస్‌.పి. తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి మీడియాకు నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చాకచక్యంగా పనిచేసి కేసును త్వరితగతిన చేదించిన డీఎస్పీలు చిదానందరెడ్డి, పోతురాజు, సిఐలు దివాకర్‌ రెడ్డి, సుదర్శన్‌ ప్రసాద్‌,  జీవన్‌ గంగనాథ్‌ బాబు, ఎస్‌.ఐ.లు సి.ఎమ్‌ రాకేష్‌, సుధాకర్‌ రెడ్డి  మరియు పోలీసు సిబ్బందిని కర్నూల్‌  జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫకీరప్ప కాగినెల్లి ప్రత్యేక అభినందించారు.కేసులో సహకరించిన ఇతర సిబ్బంది అభినందించారు.

వార్తావాహిని