యూనిట్
Flash News
ఇళ్లకు కన్నాలు వెసే దొంగల ముఠా అరెస్టు

పశ్చిమగోదావరి
జిల్లాలో ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు జిల్లా
ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల
పరిధిలో దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కొవ్వూరు పోలీసులు
అనుమానస్పదంగా వున్న పాత నేరస్ధుడైన మామిడి శెట్టి సురేష్‌ను అదుపులోకి తీసుకుని
విచారించగా పలు విషయాలు వెల్లడించాడు. సతీష్ దొంగతనాలు చేస్తూ సొత్తును కొట్ర
సతీష్, కందే గంగాధర్‌లతో కలిసి
ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకుని జల్సాలు చేసుకుంటున్నారు.
ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 180 కాసు బంగారు
ఆభరణాలనుస్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కొవ్వూరు రూరల్
సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం.సురేష్, తాళ్ళపూడి ఎస్సై
జి.సతీష్, కొవ్వూరు రూరల్ ఎస్సై కె.రామకృష్ణ, ఏఎస్సైలు యస్.ఎన్.శ్రీనివాస్, ఏ.కె.సత్యనారాయణ,
హెడ్ కానిస్టేబుళ్ళు ఆర్.భగవాన్ దాస్, జి.వి.వి. సత్యనారాయణ, టి.బుచ్చి రాజు,
ప్రసాద్‌లను ఎస్పీ అభినందించారు.