యూనిట్
Flash News
పగటి పూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

విజయవాడ నగరంలో పగటి పూట తాళాలు వేసిన ఇళ్లకు తాళాలు పగల గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీఎస్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఎసిపి ప్రకాషరావు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన తుపాకుల వెంకటేష్ బాబు (23), విజయవాడలో హోటల్‌లో క్యాటరింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో తాళాలు విరగకొట్టి ఇంట్లోని బంగారం, వెండి, నగదు మరియు సెల్ ఫోన్‌ను దొంగిలించాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ.95వేల నగదు, 11.16 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు మరియు సెల్‌ఫోన్‌లను మొత్తం రూ. లక్షా యాభైవేలరూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీసీఎస్ సి.ఐ సిహెచ్‌పి కృష్ణంరాజు, సీసీఎస్ ఎస్.ఐలు వి.శ్రీనివాసరావు తదితరులను అభినందించారు.