యూనిట్

ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న నిందితుల అరెస్టు

మోటార్‌ సైకిళ్ళపై ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇరువురు దుండగులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనుమానితులుగా గుర్తించిన రైల్వేకోడూరు ఇంటర్‌సెప్టెడ్‌ వాహన సిబ్బంది కంటపడ్డారు. నిందితులు గుంజనవాగు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోని రాఘవరాజ పురం వైపు రెండు బైక్‌లపై 22 ఎర్రచందనం దుంగలు తరలించడం గమనించారు. వెంటనే వారిని వెంబడించి, చాకచక్యంగా ఇరువురుని అదుపులోనికి తీసుకొని రెడ్‌శాండర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సమాచారం అందించారు. రెండు బైక్‌లను సీజ్‌చేసి, దుంగలను, దుండగులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోకేసులో పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రైల్వేకోడూరు టీమ్‌ తొమ్మిదిమంది నిందితులను అరెస్టుచేసి మోటార్‌బైక్‌, మినీలారీతోపాటు 94 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలం కుమ్మరపల్లి గ్రామం పరిధిలో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

వార్తావాహిని