యూనిట్
Flash News
స్మగ్లర్ల అరెస్టు
తిరుపతి, కోడూరుల నుంచి 30
ఎర్రచందనం దుంగలను కలింగ రిజర్వాయర్ మీదుగా తరలిస్తున్నట్లు రెడ్‌శాండర్స్
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్
టీమ్ శ్రీకాళహస్తి నుంచి పిచటూర్ రోడ్డులో టాటాఏస్ వాహనాన్ని అడ్డగించి
పరిశీలించగా 30 ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్నట్లు
గుర్తించారు. దీంతో వెంటనే డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకొని విచారించారు. అంతేగాక
మరో కారులో 28 దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌తోపాటు
కారులోని మరో ముగ్గురిని పట్టుకొని విచారించగా.. చేసిన నేరం ఒప్పుకున్నారు. దీంతో
వారిని అరెస్టుచేసి, కేసు నమోదు చేశారు.