యూనిట్
Flash News
నైట్ హెచ్‌బి దొంగల ముఠా అరెస్ట్
విజయవాడ
నగరంలో రాత్రి సమయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను అరెస్టు
చేసినట్లు సీసీఎస్ ఎసిపి ప్రకాశరావు తెలిపారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్
పరిధిలోని బృందావన్ కాలనీలో మరియు మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెవెన్యూ
కాలనీలో అపార్ట్‌మెంట్లలలో తలుపులు తెరచబడి వున్న ఇంట్లోకి దొంగతనాలు జరిగినట్లు
వచ్చిన ఫిర్యాదుల మేరకు సిసియస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
దొంగలపై నిఘా వుంచిన సీసీఎస్ సిబ్బందికి సాదుపాటి వంశీప్రణయ్, ఆర్యభా ప్రకాష్, పీతల
సురేంద్ర అలియాస్ సూరిలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం సేకరించారు. వారిపై
నిఘా వుంచి వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరు ముగ్గురు ముఠాగా
ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి వద్దనుండి రూ. 5లక్షల
విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి పేర్కొన్నారు.