యూనిట్

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ సుమారు రూ. 24 లక్షల విలువ చేసే 620 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలు మరియు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరు మినహా మిగితా వారందరూ పాత నేరస్తులే. ఇళ్లల్లో దొంగతనాలు చేయడంలో వీరంతా సిద్ధహస్తులు. సోమవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు   వివరాలు వెల్లడించారు.  నేరస్థులైన షికారి కోటయ్య అలియాస్ షాలి,  షికారి రామకృష్ణ అలియాస్ బుజ్జి,  షికారి మెచిలి అలియాస్ నాగి, షికారి శీన అలియాస్ సద్ సింగ్, షికారి శీను అలియాస్ పంది లను అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి  సుమారు రూ. 24 లక్షల విలువ చేసే 620 గ్రాముల బంగారు ఆభరణాలు,  180 గ్రాముల వెండి ఆభరణాలు,  రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా అరెస్టు చేసి భారీగా రికవరీ చేసిన అనంతపురం డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి పర్యవేక్షణలోని  ఇన్ స్పెక్టర్లు  మురళీధర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్ ఖాన్, ప్రతాపరెడ్డి,  ఎస్ఐ లు జయపాల్ రెడ్డి, రాఘవ రెడ్డిల  బృందాన్ని జిల్లా ఎస్పీ   అభినందించారు.

వార్తావాహిని