యూనిట్

సాయుధ దళ పని తీరు బాగుంది: గుంటూరు అర్బన్ ఎస్పీ

గుంటూరు అర్బన్ పోలీస్  మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు     సాయుధ దళ అధికారులతో  ఎస్పి పి.హెచ్.డి రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమములో ఎస్పీ మాట్లాడుచూ గడచిన  సంవత్సరములో గుంటూరు అర్బన్ సాయుధ దళ సిబ్బంది మరియు అధికారులు బాగా కష్టపడి విధులు నిర్వర్తించారన్నారు.    రాజధాని ప్రాంతమైన గుంటూరు అర్బన్ ఏరియాలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమా లలో వి ఐ పి  కాన్వాయ్ విధులు, ఎస్కార్ట్ / గార్డు విధులు, యాంటీ సబటేజ్ చెక్కింగ్స్, బందో బస్తులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరగడం సాధ్యము అయ్యిందని   అభినందించారు.   సాయుధ దళ విభాగంలో ఉన్న సాధక బాధకాలనడిగి తెలుసు కొన్నారు.  ఈ సమావేశములో ఆర్ఐ లు థామస్ రెడ్డి, రాజారావు, రాఘవయ్య, పలువురు ఆర్ఎస్ఐ లు మరియు ఎఆర్ఎస్ఐ పాల్గొన్నారు.

వార్తావాహిని