యూనిట్
Flash News
ఆయుర్వేదం వినియోగంపై అనంతపురం పోలీసు సిబ్బందికి అవగాహన సదస్సు

అందరికీ
ఆరోగ్యం- ఆయుర్వేదం వినియోగంపై పోలీసు సిబ్బందికి గురువారం అనంతపురం పోలీసు
కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా ఇంటర్నేషనల్
మార్కెటింగ్ కార్పోరేషన్ వారి సౌజన్యంతో చేపట్టిన ఈ సదస్సులో అదనపు ఎస్పీ
జి.రామాంజినేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రసాయనాలు మిళితమైన ఆహార పదార్థాల
నుండీ వ్యర్థాలను ఎలా తొలగించుకోవాలి, అందుకు
సహకరించే ఆయుర్వేద మందుల వినియోగం, ఆరోగ్యం
మెరుగుదల,
తదితర అంశాలుపై హెల్త్ న్యూట్రిషియనిస్టు మహాబాషా, హెల్త్ కన్సల్టెంట్ శ్రీనివాసరావులు సిబ్బందికి అవగాహన
చేశారు. ఆయుర్వేదంలో కీలకమైన శ్రీతులసి వినియోగం, దాని ప్రయోజనాలు గురించి వివరించారు. గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణ, డెంగ్యూ, కీళ్ల నొప్పులు, బి.పి, షుగర్ , కొలెస్ట్రాల్ , అధిక బరువు, మూత్ర బంధిత
ఇబ్బందులు, ఎలర్జీ, ఫైల్స్ , తదితర వ్యాధుల నియంత్రణ కోసం ఆయుర్వేద
ఉత్పత్తులు ఎలా ఉపయోగపడుతాయో తెలియజేశారు. డీ మొబలైజేషన్ కు వచ్చిన ఏ.ఆర్
సిబ్బందికి సాయంత్రం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఆరోగ్య సదస్సు నిర్వహించి
అవగాహన చేశారు. ఈ సదస్సులో ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ , ఆర్ ఐ లు వెంకటేశ్వరరావు, పెద్దయ్య, పలువురు ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.