యూనిట్
Flash News
దిశా మాసం పై అనంతపురం జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు
మహిళలు, పిల్లల భద్రతకు అండగా నూతనంగా అమల్లోకి తెచ్చిన దిశా చట్టం నేపథ్యంలో దిశా మాసంపై అనంతపురం జిల్లా అంతటా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలోని మహిళా మిత్ర, కోఆర్డినేటర్లు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళా మిత్ర కార్యదర్శులకు దిశ, ఫోక్సో , తదితర చట్టాలు మరియు మహిళలు, అమ్మాయిలపై జరిగే అకృత్యాలు, అఘాయిత్యాలు, తదితర నేరాలతో పాటు వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, తదితర అంశాలుపై అవగాహన చేశారు. పోలీసులకు సహకరిస్తూ మహిళలు/పిల్లలకు ఎలా అండగా నిలవాలో దిశానిర్ధేశం చేశారు. ఆయా సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, సి.ఐ లు, ఎస్ ఐ లు , సిబ్బందితో పాటు జిల్లా వ్యాప్తంగా 1925 మంది మహిళా మిత్ర, కోఆర్డినేటర్లు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళా మిత్ర కార్యదర్శులు హాజరయ్యారు.