యూనిట్
Flash News
గుండె, కిడ్నీ జబ్బులపై అనంతపురం పోలీసు సిబ్బందికి అవగాహన సదస్సు
మానవ శరీరంలోని అవయవాల్లో అతి ముఖ్యమైన గుండె, కిడ్నీ జబ్బులపై పోలీసు సిబ్బందికి శుక్రవారం అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు సిబ్బంది సంక్షేమంలో భాగంగా " కిమ్స్ సవీర" ఆసుపత్రి వారి సౌజన్యంతో చేపట్టిన ఈ సదస్సులో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అహర్నిశలు సమాజం కోసం శ్రమించే పోలీసు సిబ్బంది గుండె మరియు కిడ్నీ వ్యాధుల భారినపడకుండా మెరుగైన ఆరోగ్యం కోసం కొన్ని మెళకువలు, ముందస్తు జాగ్రత్తలను కిమ్స్ సవీర కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ , నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బద్రీనాథ్ లు సిబ్బందికి అవగాహన చేశారు. గుండె , కిడ్నీ జబ్బులు పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తెలిపారు. ప్రజల్లో చాలా మందికి ఈ జబ్బులపై అవగాహన లేక, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిపై అవగాహన పెంచుకోవడం ద్వారా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమైన సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పారు ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం మన మూత్రపిండాలు మరియు గుండె పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయన్నారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఎంచుకోవడం ఎంతైనా అవసరమన్నారు. శరీరంలో కొవ్వు శాతం అధికం కాకుండా మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలన్నారు. ఈ సదస్సులో ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెద్దయ్య, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, పలువురు ఆర్ ఎస్ ఐ లు, ఏ.ఆర్ పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.