యూనిట్

దిశా పోలీసుస్టేషన్ ఏర్పాటుకు సైబర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన అనంతపురం జిల్లా ఎస్పీ

           అనంతపురం జిల్లా కేంద్రంలోని దిశా పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం సైబర్ స్టేషన్ ను ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు పరిశీలించారు. దిశా పోలీసు స్టేషన్ సైబర్ విభాగంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంచనాకు వచ్చారు. నవీకరణ పనులను ముమ్మరం చేయాలని భావించి ఎస్పీ అనంతపురం డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డితో కలసి ఆదివారం త్రీటౌన్ సమీపంలో ఉన్న సైబర్ విభాగాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. పాత భవనం కావడంతో పునరుద్ధరణ పనులు చేయాలని సూచించారు. స్నేహపూర్వక వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలనీ ఎస్పీ భావించారు. సరికొత్త ఫర్నీచర్ , బాధిత మహిళలు స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకునేందుకు అనువైన సదుపాయాల కల్పన, మరుగు దొడ్ల నిర్మాణం, పటిష్టమైన కాంపౌండ్ గోడ, కౌన్సెలింగ్ గది, బాధిత మహిళలతో పాటు వచ్చే చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం, తదితర పనులను శీఘ్రంగా పూర్తీ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో పాటు స్పెషల్ బ్రాంచి సి.ఐ బి.వి శివారెడ్డి, త్రీటౌన్ సి.ఐ రెడ్డెప్ప, ఎస్ ఐ నాగమధు, పోలీసు హౌసింగ్ అధికారులు, తదితరులు వెళ్లారు.

వార్తావాహిని