యూనిట్

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు

తేదీ: 12-05-2023, డిజిపి కార్యాలయం, మంగళగిరి

గౌరవ డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో కృష్ణా జిల్లా, తాడిగడప  మున్సిపల్  రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం వర్క్ ఇన్‌స్పెక్టర్ (హౌసింగ్)పైన దాడులు నిర్వహించారు.

Case:1

కృష్ణ జిల్లా, పెనమలూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన బాధితుడు స్థానికంగా నూతనంగా నిర్మించిన ఇంటికి అసెస్‌మెంట్ నంబర్(పన్ను స్థిరీకరణ మరియు కొత్తగా నిర్మించిన ఇంటికి డోర్ నంబర్) కేటాయింపు కోసం తాడిగడప మున్సిపాలిటీ కార్యాలయంలో   దరఖాస్తు చేసుకున్నాడు.

అసెస్‌మెంట్ నంబర్ కోసం కృష్ణా జిల్లా, తాడిగడప మునిసిపాలిటీకి చెందిన  రెవెన్యూ ఇన్స్పెక్టర్ యరకరాజు వెంకట సుబ్బరాజు 6,000 రూపాయలను లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్నా అధికారులు ఈ రోజు మున్సిపల్  రెవెన్యూ ఇన్స్పెక్టర్ యరకరాజు వెంకట సుబ్బరాజు సూచనలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి  కథారి నాగ బాబు బాధితుడి వద్ద నుండి 6,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మరి కాసేపటిలో మున్సిపల్  రెవెన్యూ ఇన్స్పెక్టర్ యరకరాజు వెంకట సుబ్బరాజు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి  కథారి నాగ బాబు ని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.

Case:2

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, వల్లిపేట గ్రామనికి చెందిన బాధితుడు తన భార్య పేరు మీద జగనాన్న గృహనిర్మాణ పథకం క్రింద ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇంటి నిర్మాణానికి మంజూరు చేసిన బిల్లు మరియు రావలసిన బిల్లులను మంజూరు చేసేందుకు 13,000 రూపాయలను డిమాండ్ చేసిన వర్క్ ఇన్‌స్పెక్టర్ (హౌసింగ్) శ్రీ ఎం.కన్నం నాయుడు.

దీనితో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, వల్లిపేట గ్రామానికి చెందిన బాధితుడి. దీనిపైన కేసు నమోదు చేసుకున్నా అధికారులు ఈ రోజు  ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్  కార్యాలయం, లావేరు, శ్రీకాకుళం జిల్లా లో హౌసింగ్ విభాగం వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎం.కన్నం నాయుడు బాధితుడి వద్ద నుండి 13,000 రూపాయల లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మరి కాసేపటిలో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.

వార్తావాహిని