యూనిట్
Flash News
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారుల బృందం
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అధికారుల బృందం కర్నూలు జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసి రవి పటాన్ శెట్టిలతో కూడిన అధికారుల బృందం పరిశీలించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లో 95 గ్రామాలు వరద ముంపుకు గురైనవని తెలిపారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. అనంతరం మహానంది క్షేత్రాన్ని పరశీలించి తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేసారు.