యూనిట్
Flash News
భారీగా కోడికత్తులను కలిగిన వ్యక్తి అరెస్టు
సంక్రాంతి సమీపిస్తుందంటే ఉభయగోదావరి జిల్లాలో కోడి కత్తులకు విపరీతమైన డిమాండ్ వుంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కోడికత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసినట్లు కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. తాళ్ళరేవు మండలం సీతారంపురంలో కామాడి సోమరాజు సంక్రాంతి పండుగకు కోడి పందేలకు కత్తులను అమ్ముకోవడానికి ఏర్పాటు చేసుకుని రెండు యంత్రాలను పెట్టుకుని వాటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 3982 కోడి కత్తులను, వాటిని తయారు చేసే రెండు యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.