యూనిట్

పిల్లలను బాలకార్మికులుగా మారుస్తున్న ముఠా అరెస్టు

పిల్లలను బాలకార్మికులుగా మారుస్తున్న ముఠా అరెస్టు నెల్లూరు జిల్లాలో పలువురు చిన్నారులను అపహరిస్తూ వారిని బాలకార్మికులుగా మారుస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్‌ వద్ద గూడూరు డీఎస్పీ, సిఐ పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద ఉన్న చిన్నారులు శివసాయి, రామయ్య, కరుణాకర్‌ పిల్లలకు విముక్తి కలింగించారన్నారు. నిందితులు పాలకీర్తి సురేష్‌, చిన వెంకయ్యలు బాతులు మేపుకుంటూ సంచార జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారులను అపహరించుకు పోయి వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు. కేసును చేధించిన సిబ్బంది డిఎస్పీ బీ. భవాని హర్ష, ఇన్‌స్పెక్టర్‌లు కె రామకష్ణ రెడ్డి, అక్కేశ్వర రావు, జీ.పుల్లారావు, హెడ్‌ కానిస్టేబుళ్లు రాజు, చిరంజీవులు, నాపురయ్య, కానిస్టేబుళ్లు ఆదినారాయణ, మాధవరావు, నాగేంద్ర, పవిత్రాలను ఎస్పీ అభినందించారు.

వార్తావాహిని