యూనిట్

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

చిత్తూరుజిల్లా, పలమనేరు సబ్‌-డివిజన్లోని కుప్పం రూరల్‌ సర్కిల్‌ పరిధిలో దొంగ నోట్లు తయారు చేసి, వాటిని మార్కెట్‌లో మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎస్‌.పి. వెంకట అప్పల నాయుడుకు సమాచారం అందింది. వెంటనే ఎస్‌.పి. ఉత్తర్వు మేరకు ఒక ప్రత్యేక దర్యాప్తు బందం రెడీ అయింది. పోలీసుకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కుప్పం రూరల్‌ సి.ఐ. ఎం. ఆర్‌ కష్ణ మోహన్‌ ఆధ్వర్యంలో రామ కుప్పం. ప. స్‌.ఐ. ప్రసాద రావు, పోలీసు సిబ్బంది విజలాపురం గ్రామానికి వెళ్ళారు. అక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ వద్ద గల సుధాకర్‌ రెడ్డి చిల్లర అంగడి వద్ద ఉన్న కె. మనిగండన్‌, కె. కుబెంద్రన్లను పటుకున్నారు. వారివద్దనుండి 98,000/- రూపాయలు విలువ చేసే దొంగ నోట్లు స్వాధీనం చేసుకొని విచారించగా,వీరితో పాటు వారి స్నేహితులైన నలుగురు అనంత కుమార్‌, సురేష్‌ కుమార్‌, దేవి రెడ్డి సురేష్‌ రెడ్డి మరియు హేమంత్‌ కలుసుకొని కుప్పం మండలం, సామగుట్టపల్లి గ్రామం, అనంత కుమార్‌ ఇంటిలో దొంగనోట్ల్ల తయారీకి కావాల్సిన పరికరాలు దొంగ నోట్లు తయారు చేసి చుట్టు ప్రక్కల ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మార్చుతూ ఉండేవారని చెప్పారు. అంతట సామగుట్టపల్లి గ్రామంలోని అనంత కుమార్‌ ఇంటికి వెళ్ళగా మిగిలిన నలుగురు కూడా దొంగ నోట్లు తయారు చేస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం సుమారు 2,76,22,000/- విలువ చేసే దొంగ నోట్లు మరియు కంపూటర్లు-3, ల్యాప్‌ టాప్‌-2, ప్రింటర్లు-2 మరియు దొంగ నోట్లు తయారు చేయు పరికరాలు స్వాధీనం చేసుకోవడమైనది. దేవి రెడ్డి సురేష్‌ రెడ్డి, రఘునాధ రెడ్డి, విద్య నగర్‌,తిరుపతి. బి. హేమంత్‌, సుధాకర్‌ అంబేద్కర్‌ కాలనీ, తిరుపతి. వీరందరినీ అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపారు. ఈ సందర్భముగా చిత్తూరు జిల్లా యస్‌.పి. కుప్పం సి.ఐ ఆర్‌ కష్ణ మోహన్‌, యస్‌.ఐ ప్రసాద రావు వారి సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించారు.

వార్తావాహిని