యూనిట్
Flash News
దొంగనోట్ల చలామణి చేస్తున్న ముఠా అరెస్టు
దొంగనోట్ల చలామణి
చేస్తున్న ముఠా అరెస్టు నెల్లూరు జిల్లా ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాగర్ల
సెంటర్ వద్ద దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ
ఐశ్వర్య రస్తోగి తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. పబ్బాటి మురళి అలియాస్
మురళీకృష్ణ, సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాం, కాకు శ్రీను అలియాస్ శ్రీనివాసులు మరియు
షేక మౌలాలీలు ఓ ముఠాగా ఏర్పడి దొంగనోట్లను చలామణి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ డిఎస్పీ
కె.వి.రాఘవ రెడ్డికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన డిఎస్పీ తన సిబ్బందితో యాగర్ల
సెంటర్‌కు చేరుకుని పై నలుగురుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసారు. వారి వద్ద నుండి
రూ.3,99,800/- రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన విలువైన
సమాచారంతో కానికిచెర్ల నరేంద్ర కుమార్, కొడాలి రవి కుమార్, రాచపూది విద్య కుమార్
అలియాస్ విద్యా సాగర్, అచ్యుతున సునీత మరియు ప్రేమదాస్‌లను అరెస్టు చేసి వారి వద్దనుండి
రూ. 34,19,200/- రూపాయల విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల
కేసులో అత్యుత్తమ ప్రతిభ చూపిన నెల్లూరు రూరల్ డిఎస్పీ కె.వి.రాఘవరెడ్డి, సి.ఐలు శ్రీనివాస్,
కె.రామకృష్ణ, ఎస్సైలు నరేష్, సుబ్రహ్మణ్యం, శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్ళు షేక్
అమీన్, టి.శ్రీనివాసులు, ఐ ఇస్మాయిల్, కానిస్టేబుళ్ళు ఎం.రమేష్, డి.వెంకటేశ్వ ర్లు,
దేవ కిరణ్, శివనారాయణ, ఇంతియాజ్‌లను ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు.