యూనిట్
Flash News
సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి
సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి 3వ పటాలము ఆవరణలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కమాండెంట్ బి.శ్రీరామమూర్తి హాజరై సర్వేపల్లి చిత్రపటానికి పూప్పాంజలి ఘటించారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర విద్యార్థి నేర్చోకోవాల్సిన నైతిక విలువలను గూర్చి సర్వేపల్లిని చూసి నేర్చుకోవాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎం.బి.వి.వి.సత్యనారాయణ, సంక్షేమాధికారి బి.చంద్రశేఖర్, విల్సన్‌బాబు, పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.సత్యనారాయణ, విద్యార్థులు సర్వేపల్లికి నివాళులు అర్పించారు.