యూనిట్
Flash News
తిరుపతిలో ఘనంగా 71 వ గణత౦త్ర దినోత్సవ వేడుకలు
71 వ గణత౦త్ర దినోత్సవ వేడుకలును తిరుపతి అర్బన్ జిల్లా స్థానిక పోలీస్ పరేడ్ మైదానం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి పుర ప్రజలకి, విద్యార్థులకు, స్వాతంత్ర సమరయోధులకు, పోలీస్ సిబ్బ౦దికి, వారి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అర్బన్ జిల్లా యస్.పి డా. గజరావు భుపాల్ శుభాకా౦క్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు అన్నారు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎ౦దరో మహనీయుల త్యాగ౦ వలన మనకు ఆగస్టు 15, 1947 న స్వాతంత్ర్యం వచ్చ్చిందని చెప్పారు. అప్పటివరకూ మనదేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటీష్ వారు రచించిన రాజ్యాంగం ప్రకారం జరిగేదని, వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
1950, జనవరి 26న రాజ్యాంగం ఆమోదించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యిందని, ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గణతంత్ర రాజ్యం అంటే... ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థమని, గణతంత్ర, ప్రజస్వామ్యం, సార్వబౌమత్వం అనే మన రాజ్యాంగానికి మూల స్థంబాలను కాపాడటంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఉద్భోధించారు
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ నందు కళాశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ జానపద నృత్యాలు, డాగ్ అండ్ బాంబు స్క్వార్డ్ విన్యాసాలు కన్నుల పండుగగా జరిగింది.
అనంతరం 2018-2019 సంవత్సరమునకుగాను తిరుపతి అర్బన్ జిల్లా నందు విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అతి ఉత్క్రిష్ట మరియు ఉత్క్రిష్ట సేవా పథకాల పత్రాలను మొత్తం 23 మందికి జిల్లా యస్.పి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరియు అర్బన్ జిల్లా నందు ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి మొత్తము 152 మందికి కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే సాంస్కృతిక ప్రదర్శన చేసిన విద్యార్థులకు, ఇటీవల అర్బన్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ అకాలమరణం చెందిన కుటుంబ సభ్యులకు యస్.పి జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రములు అందచేయడం జరిగినది.