యూనిట్

అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి 'స్నైపర్‌ టీమ్స్‌'

అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి 'స్నైపర్‌ టీమ్స్‌' విజయనగరం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం, వాటిపై ఉక్కుపాదం మోపేందుకుగాను ప్రత్యేకంగా 'స్నైపర్‌ టీమ్స్‌'ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి తెలిపారు. 'స్నైపర్‌ టీమ్స్‌'ను జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బందాలు ప్రతి రోజూ 24 గంటలు, తన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తాయన్నారు. ఇసు, గంజాయి, మాంగనీసు అక్రమ రవాణా, పేకాట, బెట్టింగులు, కోడి పందాలు, గొర్రె పందాలు, గొలుసు మద్యం దుకాణాలను నియంత్రించేందుకు ఈ బందాలను వినియోగించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనిపిస్తే డయల్‌-100కు, వాట్సాప్‌ నంబరు 6309898989, లేకుంటే నేరుగా 9440795900 నంబర్లుకు సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.నర్సింహారావు, డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ సీఎం నాయుడు, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, ఎస్‌బీ సీఐ కె.దుర్గాప్రసాద్‌, ఒకటో పట్టణ సీఐ ఎర్రంనాయుడు, ఆర్‌ఐ శంకరరావు, రామకష్ణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని