యూనిట్

191 మంది వీధి బాలల సంరక్షణ

191 మంది వీధి బాలల సంరక్షణ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖ చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 191 మంది వీధి బాలలను సంరక్షించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. పాఠశాలలకు వెళ్ళకుండా బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్లు, మాల్స్‌, థియేటర్లు,హోటళ్లలో పని చేస్తున్న 14 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించి వారికి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సబ్‌ డివిజన్‌ పరిధిలో పిల్లలందరికి ఆరోగ్య పరీక్షలు జరిపి వారి తల్లిదండ్రులకు పిలిపించి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి పిల్లలను అప్పజెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో లేబర్‌ అధికారులు, స్త్రీ శిశు సంక్షేమశాఖాధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని