యూనిట్
Flash News
విజయనగరంలో 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
విజయనగరం ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ముఖ్య అతిథిగా 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు సుఫుర్తిదాయకంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్‌లాల్, జిల్లా జడ్జి జి. గోపి,ఇతర జిల్లా అధికారులు , వివిధ రంగాలలోని ప్రముఖులు , ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, అదే విధంగా ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు ప్రభావం చెందక స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వక్తలు ఉద్భోధించారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగంపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి తమ వంతుగా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.