యూనిట్

పౌరులుగా మన బాధ్యత ఏంటి??

నిన్న రాత్రి హెల్ప్లైన్ కి ఒక కాల్ వచ్చింది.

ఒక వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటున్న ఒకమ్మాయి ఇలా చెప్పింది.

‘‘మేము ఆఫీసు ముగించుకుని హాస్టల్కి వచ్చేటప్పటికి 6 గంటలు ఒక్కోసారి ఇంకా ఆలస్యమౌతుంది.

బస్సు దొరక్క ట్రాఫిక్జామ్లు  ఇలా చాలా కారణాలతో ఆలస్యం అయిపోతుంది.

మెయిన్ రోడ్డు నుండి హాస్టల్ వరకు వెళ్ళాంటే చీకటిలో నడిచి వెళ్ళాలి. రోడ్లకు అటు ఇటు పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడవిలాగా ఉంటుంది.

మేము ఆ చీకటిలో నడిచి వెళుతుంటే పోకిరీలు మా వెంటపడడం, బండ్ల మీద రాసుకుంటూ, మమ్మల్ని ముట్టుకుంటూ వెళుతుంటారు.

నా ఫ్రెండ్కి చాలా ఘోరమైన అనుభవం ఎదురైంది. తన బ్రెస్ట్ ని టచ్ చేసి వేగంగా వెళ్ళిపోయారు.

మేము ఎవరికీ చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాము.

ఎప్పుడైనా ఏదైనా వస్తువు అవసరమై దగ్గరే ఉన్న షాప్ కి వెళ్ళినా కామెంట్స్ చెయ్యడం, హాస్టల్ దాకా వెంట రావడం.

మాకు చాలా భయంగా ఉంది. ఎక్కడో పల్లె నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం.

మా వాళ్ళకి చెబితే ఉద్యోగం మానేసి వచ్చెయ్యమంటారు.

మాకు ఏదైనా సహాయం చెయ్యండి’’ 

ఇది ఆ కాల్ సారాంశం.

ఈ రోజు ఉదయం నేను వాళ్ళు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చూశాను.

భయానకంగా ఉంది. విద్యుత్ స్తంభాలున్నాయి కానీ బలుబులు లేవు.

రోడ్డుకు అటు ఇటు పిచ్చిమొక్క పొదలు, ఖాళీ ప్లాట్లలో అంతెత్తు ఎదిగిన ఆముదం తదితర చెట్లు.

అల్లరిమూక అమ్మాయిల్ని ఆ పొదల్లోకి గుంజుకెళ్ళినా దిక్కు లేనట్టు ఉంది.

నేను వెంటనే షీటీమ్ కి ఫోన్ చేసి నేను తీసిన ఫోటోలు, లొకేషన్ షేర్ చేశాను.

వెంటనే ఆ ఏరియా షీటీమ్ ఎస్.ఐ. ఫోన్ చేసి మూడు రోజులు మేమిక్కడ నిఘా పెడతాం.

ఆ తర్వాత అవెర్నెస్ ప్రోగ్రాం చేస్తాం మీరు రండి అని పిలిచారు.

సాయంత్రం అక్కడికెళ్ళారు. నాకు ఫోన్ చేశారు.

మన చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటివి మన కంట్లో పడితే వెంటనే షీటీమ్కు, డయల్100కు కాల్ చేస్తే అమ్మాలయికు చాలా హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం.

మన ప్రాంతాని సేఫ్టీ ఐడెంట్ చెయ్యగలిగితే, ఎక్కడ లైట్లు లేవు, ఎక్కడ పోకిరీలు గుంపుగా కూర్చుని మహిళని, అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు, నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసు గస్తీ తిరిగేలా ప్రయత్నించడం... పౌరులుగా మన బాధ్యత కాదా?.

ఇంకొక కాల్లో ఒకమ్మాయి ‘‘నేను రోజూ బస్ లో కాలేజీకి వెళ్తాను. బస్ దిగాకా చాలా దూరం నడవాలి. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ దారి మధ్యలో ఆకతాయిు నా వెంటపడి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి వస్తుంటాం. కొన్ని సార్లు క్లాసులో ఆస్యమై ఒక్కదాన్ని వస్తున్నప్పుడు వాళ్ళ ఆగడాలు మితిమీరుతుంటాయ్. మా కాలేజ్ ప్రిన్సిపాల్ కి చెప్పినా లాభం లేకపోయింది. మా ఇంట్లో వాళ్ళకి చెబితే కాలేజి మానెయ్యమంటారని భయం. మీరు ఏమైనా హెల్ప్ చెయ్యగరా? అని దాదాపు ఏడుపు గొంతుతో అడిగింది. ఆ అమ్మాయి చెప్పిన కాలేజి నాకు తెలుసు. ఎప్పుడూ వెళ్ళలేదు. షీటీమ్ లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ఫ్రెండ్ని తీసుకుని ఆ కాలేజీకి వెళ్ళాను. నిజంగానే ఆ దారి ఘోరంగా ఉంది. పక్కన ఒక చెరువుంది. అర కిలోమీటర్ దూరం నడిస్తేనే కాలేజి వస్తుంది. మేమిద్దరం వెళుతూ చూసినదేమిటంటే రోడ్డుకి అటూ ఇటూ అబ్బాయిు బైకులాపి కాలేజీకి వస్తున్న అమ్మాయిల్ని వేధిస్తూ అ్లరి చేస్తున్నారు. ఒకరిద్దరు అమ్మాయిల్ని ఆపి అడిగాం. రోజూ ఇంతేనండి. వీళ్ళు మా కాలేజీ వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మొన్న ఒకమ్మాయికి చాలా దారుణమైన అనుభవమైంది. ఒకడు పాంట్ జిప్పు విప్పి నిబడ్డాడట. ఆమె చాలా భయపడిపోయింది. కాలేజీకి రావడం మానేసింది. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. నా కానిస్టేబుల్ ఫ్రెండ్ వెంటనే షీటీమ్స్ కి ఫోన్ చేసి పిలిపించింది. అక్కడున్న వాళ్ళందరినీ పట్టుకుని పక్కనున్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మూడు రోజుపాటు అక్కడే నిఘా వేశామని తను నాతో చెప్పింది.

మాకు ఫోన్ చేసిన అమ్మాయి చాలా సంతోషంగా ఇలా చెప్పింది.‘‘మేడం మీకు చాలా థాంక్స్. చాలా కాలంగా మేము పడుతున్న ఇబ్బందులు తొలగించారు. ఇప్పుడు హాయిగా ఏ బాధాలేకుండా నడవగులుగుతున్నాము.

షీటీమ్స్ వాళ్ళు మా కాలేజీకి వచ్చి అవగాహన కలిగించి ఫోన్ నంబర్ ఇచ్చారు. మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ నంబర్ కి ఫోన్ చెయ్యమని చెప్పారు. థాంక్ యూ సో మచ్’’ అంది చాలా సంతోషంగా.

ఈ పనిని కాలేజి వాళ్ళు చేసి ఉండొచ్చు. తల్లితండ్రులు చేసి ఉండొచ్చు, పౌరునిగా ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ చాలా సార్లు మనకెందుకులే అనే ఉదాసీనత, మన సమస్య కాదులే అనే భావన మన ఆడపిల్లకి ఎన్నో సమస్యలని సృష్టిస్తుంది. 

మనం చాలా సార్లు సమస్య చిట్టాని విప్పుతాం కానీ మనం ఏమి చెయ్యొచ్చు అనే ఆలోచన చెయ్యం.

రోడ్ల మీద, బస్సుల్లో అమ్మాయిని ఎవరైనా వేధిస్తుంటే సాధారణంగా ఎవ్వరూ పట్టించుకోరు.

నాకెందుకులే అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ప్రతి బస్సులోకి పోలీసులొచ్చి రక్షించలేరు కదా. మన ఆడపిల్లలు కూడా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇలాంటి వేధింపులే ఎదుర్కొంటారు, తమలాగే ఎవ్వరూ వారి సాయానికిరారు అనే ఇంగితం కూడా ఉండదు. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాలు మన పిల్లల కోసం భద్రంగా, సురక్షితంగా ఉండాలి అని ఆలోచిస్తే, ప్రజ భాగస్వామ్యం ఉంటే మన ఆడపిల్లల బయట సురక్షితంగా తిరగగుగుతారు.

మేము షీటీమ్ కి అఫెండర్స్ కి కౌన్సెలింగ్ చేసేటప్పుడు వాళ్ళు రోడ్ల మీద, కాలేజీ ముందు, బస్సు స్టాపుల్లో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుంటారో వీడియోల్లో చూస్తుంటాం. వాళ్ళ అ్లరి, అసభ్యమైన కామెంట్లు, అమ్మాయి చుట్టూ బైకులేసుకుని వాళ్ళు తిరుగుతుంటే కూడా ఎవ్వరూ పట్టించుకోని దృశ్యాు చూసి మేము చాలా ఆశ్చర్యపోతుంటాం.

పౌయిగా మన బాధ్యతని మనం మర్చిపోవడం వలనే  ఈ రోజు మన ఆడపిల్లలు ఇంటి గడప దాటగానే బయట ఎన్నో ఇబ్బందును ఎదుర్కొంటున్నారు.

గ్రామాల నుంచి పట్టణాకు వెళ్ళి చదువునే అమ్మాయిల కష్టాలకు అంతే ఉండదు. సరైన రవాణా సదుపాయముండదు.

షేర్ ఆటోలు సురక్షితం కాదు. నడిచి వెళ్ళే దారుల్లో లైట్లుండవు. పిచ్చి పొదల్లాంటివి పెరగడంతో పాటు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండడం వల్ల అమ్మాయిల మీద లైంగిక దాడులు  కూడా జరుగుతున్నాయి. తమ ఊరి ఆడపిల్లలను సురక్షితంగా స్కూల్ కో, కాలేజీకో వెళ్ళిరావడానికి తగిన ఏర్పాట్లు చెయ్యడం ఊరి బాధ్యత కాదా? ఊళ్ళో అందరూ పూనుకుంటే ఈ పని చెయ్యలేరా? 

హాజీపూర్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. తమ ఊరి ఆడపిల్లలు లైట్లు, బస్సు లేని నిర్మానుష్య రోడ్ల మీద చదువుకోవడానికి వెళుతున్నారని తెలుసు.

ఆ విషయాన్ని సీరియస్ గా పట్టించుకుని ఉంటే ముక్కుపచ్చలారని ముగ్గురు ఆడపిల్లల  దారుణమైన  లైంగిక హింసకి గురై బావుల్లో శవాలై తేలేవాళ్ళు కాదు.

ఈ దుస్సంఘటన  జరిగిన హాజీపూర్ గ్రామానికి వెళ్ళినపుడు బ్రహ్మజెముళ్ళ పొదతో, వదిలేసిన వ్యవసాయ బావుతో, మనిషి జాడ కనిపించని ఆ దారిలో ముగ్గురు అమ్మాయిలు  భయానక హింసకి గురై మరణించిన బావును చూసినప్పుడు నా గుండె చెరువైపోయింది. వారం రోజుల పాటు ఆ దృశ్యాలు కళ్ళల్లోంచి కద లేదు.

తమ ఊళ్ళో ఆడుతూ పాడుతూ తిరిగిన ముగ్గురాడపిల్లల మరణాలకు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో ఊరి వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంది.

మరణించిన మా పిల్లలకు న్యాయం చెయ్యండి అని ఇప్పుడడుగుతున్నారే  వాళ్ళు బతికున్నప్పుడు మా ఊరికి బస్సు నడపండి, లైట్లు వెలిగించండి అని అడగలేకపోయారెందుకు?

ఆ బ్రహ్మజెముళ్ళ పొదల్ని నరికి, ఆ బావు మీద ఓ కన్నేసి ఉంటే ఆ పిల్లలు బతికేవాళ్ళు కాదా??

సో... పోలీసు చేసే పని పోలీసు చెయ్యాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చెయ్యాలి నిజమే మరి పౌరునిగా మనమేం చెయ్యాలి. మన బాధ్యతేంటి???

వార్తావాహిని