యూనిట్
Flash News
పాత కరెన్సీ చలామణీ చేస్తున్న ముఠా అరెస్టు
విశాఖ
నగరంలో పాత నోట్లను చలామణీ చేస్తున్న పదమూడు మంది సభ్యులను అరెస్టు చేసినట్లు నగర
పోలీస్ కమీషనర్ ఆర్.కె.మీనా తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం రద్దు చేసిన రూ. కోటి తొంబై ఏడు వేల రూపాయల పాత నోట్లను పద్నాలుగు మంది
సభ్యులుగల ఒక ముఠా నగరంలోని వ్యాపారుల వద్దకు వెళ్ళి కొత్త నోట్లు ఇస్తే 15 శాతం అధికంగా పాత నోట్లను ఇస్తామని
చెబుతున్నారు. విశాఖ నగరానికి చెందిన ఒక వ్యాపారి తనకు పాత నోట్లు కావాలని ఈ
ముఠాను ఆశ్రయించాడు. వారు మోసాలకు పాల్పడుతున్నారని గమనించిన వ్యాపారి పోలీసులకు
సమాచారం అందించాడు. దీని పై నిఘా వేసిన పోలీసులకు పలు విస్తుగొలిపే విషయాలు
బయటపడ్డాయి. ముఠా సభ్యులు తమ సుపారి వాహనాలకు పోలీస్ అనే నేమ్ ప్లేట్‌లను
పెట్టుకుని తిరుగుతున్నారు. పరవాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పోలీస్ నేమ్ ప్లేట్
తో తిరుగుతున్న వాహనంపై నిఘా వేసి పట్టుకున్నారు. 13
మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.కోటి తొంబై ఏడు వేల
రూపాయల పాత నోట్లను, వాకీ టాకీలను, నకిలీ తుపాకిని మరియు ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా
ప్రధాన ముద్దాయిని అరెస్టు చేయాల్సి వుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ - ఉదయ్
భాస్కర్, క్రైమ్ ఎసిపి శ్రావణ్‌కుమర్, సి.ఐ రఘువీర్ విష్ణు, ఎస్సై గోపీకృష్ణ
తదితరులు పాల్గొన్నారు.