యూనిట్

సుపారీ గ్యాంగ్ అరెస్ట్

వైకాపాకి చెందిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు ఎం. చిరంజీవిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ముఠాను విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ ఆర్. కె. మీనా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె. అమ్మినాయుడు, ఎం. చిరంజీవి స్నేహితులు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు తెలుగు దేశం పార్టీలో వున్నారు. ఎన్నికలకు ముందు చిరంజీవి వై కాపా లో చేరాడు. అప్పటినుండి ఇద్దరి మధ్య వైరం పెరిగింది. అమ్మినాయుడు ఎంపిటిసి గ పనిచేస్తున్న సమయంలో 40  సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఎస్సి సామజికవర్గానికి అవసరమైన స్మశాన వాటికకు కేటాయించారు. ఆ స్థల కేటాయింపు విషయంలో చిరంజీవి వర్గం అమ్మినాయుడు తో గొడవపడి హత్యాయత్నం చేసారు. అమ్మి నాయుడు ఫిర్యాదుతో చిరంజీవి పై ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయి వుంది.

విశాఖకు చెందిన జర్నలిస్ట్ కిల్లి ప్రకాష్ కు మరియు చిరంజీవికి స్థల విషయమై గొడవలున్నాయి. అమ్మినాయుడు మరియు ప్రకాష్ లు కలిసి చిరంజీవిని హత్య చేయడానికి పథకం పన్నారు. అందుకు గాను విశాఖ లోని చినముసిరివాడకు చెందిన రాజన కన్నబాబుకు సంప్రదించాడు. సీతమ్మ పేటకు చెందిన గంటా రామరాజు, ఏ. ఏసుదాసు. పి. అనిల్ కుమార్, మాధవధారకు చెందిన మదన్, శ్రీకాకుళం జిల్లా పలసకు చెందిన బి. పరమేష్, ఫరీద్ పేటకు చెందిన తేజేశ్వర రావు కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. హత్య కోసం 10 లక్షల సూఫారి కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ. 4 లక్షలు తీసుకున్నారు. గత నెలలో రాజన కన్నబాబు నేతృత్వం లోని సూఫారి ముఠా చిరంజీవి గ్రామానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. వీరి కదలికలపై నిఘా వేసిన విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారు ప్రయాణిస్తున్న కారును పెందుర్తి కూడలి వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ. 70  వేల నగదు, 5  సెల్ ఫోన్ లు, ౩ వేట కొడవళ్లును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు. మదన్, అమ్మినాయుడు, తేజేశ్వర రావు, పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

వార్తావాహిని