యూనిట్
Flash News
నిండు ప్రాణాన్ని కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా చీమ కీర్తి మండలం ఆర్‌ఎల్‌పురానికి చెందిన పి. మురళీకృష్ణ సోమవారం ఉదయం తొమ్మిది గంటల
ప్రాంతంలో ఇంటినుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం తన పిన్ని కుమారుడు శశిధర్‌కు ఫోన్ చేసి, కుటుంబంలో వచ్చిన విభేదాలతో తనువు చలిస్తున్నానని తెలిపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చరవాణి కట్
చేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా మురళీకృష్ణ నుంచి స్పందన కరవైంది.
తీవ్ర ఆందోళనకు గురైన శశిధర్ తమ వారితో కలిసి స్పందన కార్యక్రమంలో ఉన్న ఒంగోలు
గ్రామీణీ సీఐ పి. సుబ్బారావుకు సంఘటనపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మురళి క్రిష్న
చెల్లెలు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్సై ఫాతిమా కు ఫిర్యాదు
చేసారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చీమకుర్తి ఎస్సై
పి.నాగశివారెడ్డితో పాటు ఇతరులతో మాట్లాడి, దర్యాప్తు కోసం
ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సెల్‌టవర్ లొకేషన్ తెల్సుకున్నారు. . ఒంగోలు నగర శివారు సుజాతనగర్ ప్రాంతంలో ఆయన
ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సై, పోలీసులు వాయువేగంతో
చేరుకున్నారు. అక్కడి శివార్లలోని పొలాల్లో మురళీకృష్ణ పురుగుమందు తాగి
అపస్మారకంగా పడివున్నారు. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు
అతన్ని ఒంగోలులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడడ చికిత్స
పొందుతున్నారు. పోలిసుల చొరవ ఓ నిండు
ప్రాణాన్ని కాపాడింది. ఉత్తమ పనితీరు
కనబర్చి నిండు ప్రాణాలను కాపాడిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సిధార్థ కౌశల్
అభినందించారు.