యూనిట్

గుట్కా అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

 2014 సంవత్సరం నుండి నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు గుట్కాను అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా  మరియు గంజా డాన్ చెక్కా ఆంజి బాబు మరియు అతని గ్యాంగ్  అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు.  ఈ నెల్ నాలుగో తేదీన  వచ్చిన  సమాచారంమేరకు సిక్ప్ పోర్టు, వారి సిబ్బందితో పాటు నెలటూరు గ్రామంలోని  జిన్కో  లేబర్ కాలనీలోని ఓ గోడౌన్ వద్ద  దడి చేయగా చెక్క అంజిబాబు, జోనలగడ్డ సుమన్, తంజావురు మహేంద్ర, గోవిండు శ్రీనివాస రెడ్డి, చిన్నపారెడ్డి రాజేంద్ర మరియు చెరుకూరి విజయకుమార్ల వాహనాలతో గుమిగూడి ఉన్నారు. వారిని విచారించగా  వారి వద్ద  10 కిలోల గంజాయి తో పాటు రెండు లారీలు,  ఒక ఇన్నోవా  ఒక మారుతి ఓమ్ని కార్లు  మరియు వాటిలో ప్రభుత్వం నిషేధించిన  70లక్షల  గుట్కా పాకెట్స్ ఉన్నాయ్. వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి 10 కిలోల గంజాయి,  రెండు లారీలు,  ఒక ఇన్నోవా  ఒక మారుతి ఓమ్ని కార్లు మరియు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబర్చిన  రూరల్ డి.యస్.పి.  రాఘవ రెడ్డి, సి ఐలు  శ్రీనివాసన్,   రామకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బందిని అభినందించారు. 

వార్తావాహిని