యూనిట్

ఇంటి దొంగలను అరెస్ట్ చేసిన కలువాయి పోలీసులు

నెల్లూరు జిల్లా కలువాయ మండలం చీపినాపిగ్రామం లో ఈ నెల  18 న జరిగిన ఇంటి దొంగతనం కేసును కలువాయి పోలీసులు ఛేదించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ ఎస్ మక్బుల్ తెలిపారు. కేసు వివరాలను అయన వెల్లడించారు. దొంగతనము జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో అదే మండలం   వేరుబోట్లపల్లి గ్రామానికి చెందిన   గోగుల శివయ్య@శివ పై అనుమానం వచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుండి   సుమారు   11 సవర్ల బంగారు ఆభరణాలువాటి విలువ రూ,3,30,000/- గల వస్తువులు స్వాధీనం పరుచుకున్నారు.ఈ కేసులో  చాక చక్యంగా వ్యవహరించిన  పోదలకూరు సి.ఐ.జి .గంగాధర్ రావు, కలువాయి ఎస్సై ఎం. ఆంజనేయులు, ఏఎస్సై  రమణయ్య, కానిస్టేబుల్స్ బి. వెంకటేశ్వర్లు, ఐ  లక్ష్మయ్యమరియు ఇతర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

వార్తావాహిని