యూనిట్

అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి నట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్‌.పి. అద్నాన్‌ నయీం ఆస్మి తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కస్కూరుకు చెందిన కంచర్ల మోహనరావు రెండు రాష్ట్రాలలో కలిపి 30 కేసులున్నాయన్నారు. ఇతను కాకినాడలో 2015 నుండి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు దొంగతనాలు, సర్పవరం పోలీస్టేషన్‌ పరిధిలో ఒక కేసు, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు దొంగతనాలు, విజయవాడలో మూడు నేరాలు, ఒంగోలులో ఒక నేరం చేసినట్లు వెల్లడించారు. ఇతని వద్ద నుండి 527 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఆకుల శ్రీను, తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరానికి చెందిన పాలెపు చిన్న ఇంటి తాళాలు బద్దలు గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిరువురు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిని అరెస్టు చేసి వారి నుండి 43 గ్రామల బంగారం, 250 గ్రామల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌.పి. తెలిపారు.

వార్తావాహిని