యూనిట్

ఇళ్లకు కన్నం వేసే దొంగ అరెస్ట్

అంతర్‌ జిల్లా దొంగను అరెస్ట్‌ చేసినాట్లు జంగారెడ్డిగూడెం  డీఎస్పీ ఎం.స్నేహిత తెలిపారు. జంగారెడ్డిగూడెం   సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన  సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దంశెల్లి శివను ఒక దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశామన్నారు. అతను గత ఏప్రిల్‌ 30న తాడువాయిలో ఒక ఇంటిలో దొంగతనం చేశాడన్నారు. అతన్ని విచారించగా  జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం స్టేషన్ల పరిధిలోనే కాకుండా ఇతర సరిహద్దు  జిల్లాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు.  అతడి నుంచి సుమారు రూ. 4 . 50  లక్షల విలువైన  14.750 కాసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ బిఎన్‌.నాయక్‌, ఎస్‌ఐ అల్లు దుర్గారావులు పాల్గొన్నారు. 

వార్తావాహిని